

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.
నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ ప్రాంతాల్లో పార్క్ చేయాలని సూచించారు. ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే బస్సులు, వ్యాన్లలోని ప్రయాణికులు గాంధీభవన్ బస్ స్టాప్ వద్ద దిగేందుకు అనుమతి ఇవ్వగా, నాంపల్లి వైపు నుంచి వచ్చే భక్తులు గృహకల్ప బస్ స్టాప్ వద్ద దిగవచ్చు. వీఐపీ కార్ పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ద్విచక్ర వాహనాల కోసం మనోరంజన్ కాంప్లెక్స్, భీమ్‌రావ్ బాడా ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయగా, ఆటోలలో వచ్చే భక్తులకు షెజాన్ హోటల్ ఎదురుగా ప్రత్యేక డ్రాప్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!