

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరాన్ని సందర్శించిన భారత సంతతికి చెందిన ఇద్దరు యువతులు ప్రమాదకర అలల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. బాధితులను ఫ్రీమాంట్‌కు చెందిన హర్షిత నాయర్ (21), మహియాల్ శ్రాన్ (20)గా గుర్తించారు. శాంటా క్రూజ్ కౌంటీలోని ప్రసిద్ధ బోనీ డూన్ బీచ్‌ను సందర్శించిన ఈ ఇద్దరు స్నేహితులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం, సముద్ర తీరంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా భారీ అలలు ఒక్కసారిగా దూసుకురావడంతో వారు సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించగా హర్షిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మహియాల్ శ్రాన్ మూడు రోజుల తర్వాత మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!