

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల సినిమా అప్డేట్లు పెద్దగా రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు.
‘కేజీక్యూ’ సినిమా ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ మాట్లాడుతూ, ముందుగా ప్రకటించిన ప్రకారమే డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల అవుతుందని తెలిపారు. అంతేకాకుండా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీపై నిర్మాత ధీమా వ్యక్తం చేయడంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!