
క్రీడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో యూఎస్ ప్రభుత్వం భారీగా రీఫండ్‌లు ప్రారంభించింది. ఇప్పటివరకు 100 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతిదారులకు తిరిగి చెల్లించింది. ట్రంప్ రెండో దఫా అధికారంలో అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం కింద పలు దేశాలపై భారీ సుంకాలు విధించి మొత్తం 166 బిలియన్ డాలర్లు వసూలు చేశారు.
అయితే ట్రంప్ తన అధికారాలను మించి ఈ సుంకాలు విధించారని సుప్రీంకోర్టు తేల్చింది. కంపెనీల నుంచి వసూలైన అధిక సుంకాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలకు పెద్ద ఊరట లభించింది. ఒక సమయంలో ఈ సుంకాల ద్వారా అమెరికా ఖజానాకు రోజుకు వేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!