

అక్రమ వలసలకు సంబంధించిన నేరాలను అరికట్టేందుకు యూకే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం కింద తొలిసారిగా ఓ వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (NCA), వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో భాగంగా భారతీయుడైన 24 ఏళ్ల హేమ్ రాజ్‌ను సెప్టెంబర్ 15న స్మెత్‌విక్‌లో అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలు, శరణార్థి దరఖాస్తులకు సంబంధించిన సలహాలు అందిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
బోర్డర్ సెక్యూరిటీ, ఆసైలమ్ అండ్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 2025లోని సెక్షన్ 17 కింద అక్రమ వలస సేవలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేసినట్లు హేమ్ రాజ్‌పై కేసు నమోదైంది. కొత్త చట్టంలోని ఈ నిబంధన కింద ఎన్‌సీఏ దర్యాప్తులో తొలిసారిగా ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదైనట్లు బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ తెలిపింది. అలాగే 1999 ఇమ్మిగ్రేషన్ అండ్ ఆసైలమ్ యాక్ట్ కింద అక్రమంగా ఇమ్మిగ్రేషన్ సలహాలు అందించినట్లు మరో అభియోగం కూడా నమోదైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!