

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది. వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఉన్నతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సహా ఇరాన్ కీలక ప్రతినిధి బృందానికి అమెరికా వీసాలు మంజూరు చేసింది. ఐరాసకు ఆతిథ్య దేశంగా తమ బాధ్యతలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
అయితే గతేడాదితో పోలిస్తే ఇరాన్ ప్రతినిధి బృందం సంఖ్య తక్కువగా ఉండనుంది. అమెరికాలో వారి ప్రయాణంపై పరిమితులు విధించడంతో పాటు విలాస వస్తువుల కొనుగోలుపైనా ఆంక్షలు ఉంటాయని అమెరికా తెలిపింది. ఇదిలా ఉండగా.. అమెరికా మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, ఇతర ఉన్నతస్థాయి పాలస్తీనా అధికారులకు వీసాలు నిరాకరించింది. పాలస్తీనా నాయకత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఇజ్రాయెల్‌పై కేసులు వేయడం వంటి చర్యలు శాంతి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అబ్బాస్ ఐరాస సమావేశంలో వీడియో ద్వారా ప్రసంగించేందుకు ఐరాస అనుమతించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!