

దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన సిబ్బందిలో ఎనిమిది మందిని సంస్థ మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన రెండు గంటల్లోపు తప్పనిసరిగా పోస్ట్-ఫ్లైట్ డిక్లరేషన్, బ్రీత్ అనలైజర్ పరీక్ష పూర్తి చేయాల్సి ఉండగా.. వారు 35 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరయ్యారు.
ఈ ఘటనను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లింది. సిబ్బందికి నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినప్పటికీ, నిర్ణీత గడువులో పరీక్షకు హాజరుకాకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి సంస్థ చర్యలు తీసుకుంది. ఇటీవల ఫుకెట్-దిల్లీ విమాన ఘటనలో పైలట్ డ్రగ్ టెస్టులో సైకోయాక్టివ్ పదార్థానికి పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో విమాన సిబ్బంది పరీక్షలపై మరింత కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!