

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ, టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ. శరత్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎస్వీబీసీని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా తీసుకెళ్లే అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఛానెల్ నిబంధనలకు అనుగుణంగా మరిన్ని ప్రకటనలు తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని బి.ఆర్. నాయుడు సూచించారు. ఇందుకోసం మార్కెటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ఎస్వీబీసీ ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు, ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ప్రస్తుతం అద్దెకు తీసుకుంటున్న మౌలిక సదుపాయాలు, పరికరాలను భవిష్యత్‌లో కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ తెలిపారు. టీటీడీకి వివిధ మార్గాల్లో ఆదాయం వచ్చేలా చర్యలు చేపడతామని, సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసి శ్రీవారి వైభవం, ఉత్సవాలు, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, టీటీడీ అనుబంధ ఆలయాల విశేషాలను నాణ్యంగా ప్రజలకు చేరవేస్తామని చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!