

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11 ఎపిసోడ్ గొడవలు, కెప్టెన్సీ పోటీని కాసేపు పక్కన పెట్టి ఫుల్ ఫన్‌తో సాగింది. గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ కోసం హౌస్‌మేట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో బిగ్‌బాస్ వారికి రిలాక్సేషన్ కోసం ఇమిటేషన్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఒక కంటెస్టెంట్ మరో హౌస్‌మేట్‌లా నటించి అలరించాల్సి ఉంటుంది. తొలుత షాలినీ, త్రిగుణ్ కలిసి చేసిన పెర్ఫార్మెన్స్ నవ్వులు పూయించింది.
ఈ టాస్క్‌లో నరేష్ తనదైన శైలిలో అదరగొట్టాడు. వంశీ నడక, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీని అనుకరించి హౌస్‌మేట్స్‌ను నవ్వించాడు. ఆ తర్వాత సుధీర్, దేబ్జానీలను కూడా ఇమిటేట్ చేసి ఎంటర్‌టైన్ చేశాడు. రామ్ ప్రసాద్ అమన్ వాకింగ్ స్టైల్‌ను అనుకరించడంతో పాటు వర్షిణిపై వేసిన పంచ్ కూడా హౌస్‌లో నవ్వులు పూయించింది. వర్షిణి సైతం ఆ వ్యాఖ్యను సరదాగా తీసుకుని నవ్వింది. మరోవైపు కెప్టెన్సీ రేసు కూడా కొనసాగింది. ఇప్పటికే ముఖేష్ గౌడ, ఝాన్సీ, షాలినీ, రామ్ ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ రేసులో ఉండగా, రీ-ఎంట్రీ ఇచ్చిన చరణ్ కూడా కెప్టెన్సీ కంటెండర్‌గా చేరాడు. గత ఎపిసోడ్‌లో జరిగిన ఫిజికల్ ఫైట్‌పై నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో స్పందిస్తారా అనే చర్చ కూడా హౌస్‌లో జరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!