

అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రంపై సంతకాలు జరగడంతో హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ ఓడరేవులకు రాకపోకలు సాగించే నౌకలపై విధించిన దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. దీంతో హర్మూజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకల ప్రయాణం తిరిగి ప్రారంభమై, ప్రపంచ చమురు రవాణా త్వరలో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలోనే మోహరించి ఉంటాయని సెంటకామ్ స్పష్టం చేసింది. మరోవైపు, ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదా దురుద్దేశంతో వ్యవహరించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబఫ్ మాట్లాడుతూ, గత ఘర్షణల్లో ఎదురైన నష్టాలను గుర్తుంచుకోవాలని, మళ్లీ అదే మార్గంలో నడిస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!