

అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్, పిల్లలతో కలిసి అలాస్కాలోని యాంకరేజ్‌కు వెళ్లారు. రిపబ్లికన్ సెనేటర్ డాన్ సుల్లివన్ తిరిగి ఎన్నికయ్యేందుకు మద్దతుగా నిర్వహించిన రిపబ్లికన్ నేషనల్ కమిటీ ర్యాలీలో జేడీ వాన్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డెమొక్రాట్ మేరీ పెల్టోలాపై సుల్లివన్ పోటీ చేస్తున్నారు. ఈ పర్యటనతో ఉషా వాన్స్ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలను సందర్శించినట్లు సమాచారం.
ఈ ప్రయాణ సమయంలో ఉషా వాన్స్ తడబడిన ఘటనపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు ఎదురుగా ఉన్న సిబ్బంది వెంటనే సహాయం చేసేందుకు ప్రయత్నించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, కుటుంబం దాదాపు 7.5 గంటల పాటు ప్రయాణించింది. తొమ్మిది వారాల పసికందుతో సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఉషా అలసిపోయినట్లు తెలుస్తోంది. జేడీ వాన్స్, ఉషా దంపతులకు నలుగురు పిల్లలు ఉండగా, వారిలో అలెక్ 2026 జూలైలో జన్మించాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!