
జనరల్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిషికేశ్-భానియావాలా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన దాదాపు 3 వేల చెట్ల నరికివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకు చెట్ల తొలగింపు ప్రక్రియను కొనసాగించబోమని సీఎం ప్రకటించారు.
ఈ విషయాన్ని ధామీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. రహదారి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత కోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరిపిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో చెట్ల తొలగింపుపై వచ్చిన పర్యావరణ ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!