2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

Writer: Chandrika 10:08 AM, 2 సెప్టెంబర్, 2026
అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవో ఎవరనేది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం ప్రకటించనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ నివాసంలో మధ్యాహ్నం నుంచి జరిగే సమావేశంలో సీఈవో ఎంపిక కమిటీ తుది జాబితాను సమర్పించనుంది. ముగ్గురి పేర్లతో కూడిన ఆ జాబితా నుంచి ఒకరిని ట్రస్టు ఎంపిక చేయనుంది. ట్రస్టు ప్రధాన కార్యదర్శితోపాటు మరో ఇద్దరు సభ్యుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సీఈవో ఎంపిక కమిటీ సభ్యులైన రిటైర్డ్‌ జస్టిస్‌ ప్రమోద్‌ కొహ్లీ, రిటైర్డ్‌ ఎల్జీ విష్ణుకాంత్‌ చతుర్వేది, నిపుణ సభ్యుడు సురేశ్‌ హావ్డే ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. సీఈవో పోస్టుకు వచ్చిన 5,585 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. తుది దశలో 16 మందిని ఇంటర్వ్యూ చేసినట్లు జస్టిస్‌ ప్రమోద్‌ కొహ్లీ తెలిపారు.

రామాలయంలో కానుకలు, విరాళాల చోరీకి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో తలెత్తిన వివాదం తర్వాత ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌, ట్రస్టీ అనిల్‌మిశ్ర తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రస్టు సభ్యుడు విమలేంద్ర మోహన్‌ ప్రతాప్‌ మిశ్ర మరణంతో మరో ఖాళీ ఏర్పడింది. దీంతో మూడు కీలక పదవుల భర్తీపై ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన జగదీశ్‌ ఆఫ్లే రామాలయ నిర్మాణ సమయంలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్‌ చేసిన ఆయనను ట్రస్టు తొలి కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్‌ లాల్‌ బాగ్డాకు కూడా ట్రస్టులో చోటు లభించే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

ట్యాగ్లు
అయోధ్య రామాలయంరామ జన్మభూమి ట్రస్టురామాలయ సీఈవోఅయోధ్యశ్రీరామ మందిరంజగదీశ్‌ ఆఫ్లేచంపత్‌రాయ్‌నృత్య గోపాల్‌దాస్‌వీహెచ్‌పీఆలయ పరిపాలన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం
జనరల్

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!
జనరల్

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్
సినిమాలు

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!