

భారత రక్షణ దళాల చరిత్రలో మహిళా సాధికారతకు మరో స్వర్ణ అధ్యాయం చేరింది. ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) నుంచి తొలిసారిగా తొమ్మిది మంది మహిళా క్యాడెట్లు శాశ్వత కమిషన్ ద్వారా ఆర్మీలో అధికారిణులుగా నియమితులయ్యారు. డెహ్రాడూన్‌లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘట్టాన్ని చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. సైన్యంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా ఇది కీలక ముందడుగుగా నిలిచింది.
సుప్రీంకోర్టు 2020లో మహిళలకు శాశ్వత కమిషన్‌కు అర్హత కల్పిస్తూ ఇచ్చిన తీర్పు, 2021లో ఎన్‌డీఏలో ప్రవేశానికి అనుమతి ఇవ్వడం వంటి కీలక నిర్ణయాల ఫలితంగా ఈ అవకాశం సాధ్యమైంది. 2022లో శిక్షణ ప్రారంభించిన తొలి మహిళా బ్యాచ్‌లోని క్యాడెట్లు పురుషులతో సమానంగా కఠినమైన శిక్షణ పూర్తి చేసి ఈ ఘనత సాధించారు. వీరి విజయం దేశవ్యాప్తంగా సైన్యంలో చేరాలనే కలలు కనే యువతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!