
జనరల్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పేవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.
సమావేశంలో పాలక మండలి ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డా. మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం. రాఘవేందర్ రావు, డా. లక్ష్మీనారాయణ నాయక్ తదితర సభ్యులు హాజరయ్యారు. దేవస్థానం అభివృద్ధి, పాలనకు సంబంధించి ముఖ్యమంత్రి పాలక మండలికి దిశానిర్దేశం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!