
జనరల్

భారత్‌లో యువతకు తగిన ఉద్యోగాలు కల్పించడం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు భారీగా ఉద్యోగాలను సృష్టించిన ఐటీ రంగంలో కూడా ప్రస్తుతం నియామకాలు మందగించాయని తెలిపారు.
టెక్నాలజీ సంస్థలు ఇప్పుడు తమ పెట్టుబడులను ఉద్యోగాల విస్తరణ కంటే కృత్రిమ మేధ (AI), డేటా సెంటర్ మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రీకరిస్తున్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ కంపెనీల మాదిరిగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు లేకపోయినా, గత కొన్నేళ్లుగా దేశీయ ఐటీ రంగం, జోహో సహా, కొత్త ఉద్యోగాలను ఆశించిన స్థాయిలో సృష్టించలేకపోయిందని వెంబు అభిప్రాయపడ్డారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!