
సినిమాలు

దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రుక్మిణి వసంత్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచింది. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు ఫిలింనగర్‌లో బలమైన ప్రచారం జరుగుతోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.
గతంలో ఒక ఇంటర్వ్యూలో నాని తనకు అత్యంత ఇష్టమైన తెలుగు హీరో అని రుక్మిణి వసంత్ వెల్లడించింది. ఆయనతో కలిసి పని చేయాలని తన కోరిక అని కూడా చెప్పింది. ఇప్పుడు నాని నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె నటించనున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!