
సినిమాలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ భారీ స్పందన తెచ్చుకోగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, శ్రీలంకలో హాలీవుడ్ స్థాయి భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. అడవులు, కొండలు, సముద్రతీర ప్రాంతాల్లో ఈ సీన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సీన్ థియేటర్లను షేక్ చేసేలా ఉండబోతుందని, సినిమా హైలైట్‌గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!