

ధనుష్ కథానాయకుడిగా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఓం చాప్టర్ 1 సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో అక్టోబర్ 16న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే సమయంలో భారీ చిత్రాలు బరిలోకి దిగనున్న పరిస్థితి కనిపించడంతో విడుదల తేదీపై కొత్త చర్చ మొదలైంది.
దసరా సందర్భంగా రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2తో పాటు చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న విశ్వంభర కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్య ఓం చాప్టర్ 1 విడుదలైతే థియేటర్లతో పాటు వసూళ్లపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే చిత్ర బృందం మరో విడుదల తేదీపై ఆలోచించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్, శ్రద్ధా అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీపై తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!