

తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇటీవల ‘తలైవాన్ తలైవి’, ‘ఇడ్లీ కడై’ వంటి సినిమాలతో అలరించిన ఆమె.. చిన్న విరామం తర్వాత ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘యామిరుక్కా బయమే’ వంటి వినోదాత్మక హారర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
కామెడీ, హారర్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డీకే మార్క్ వినోదానికి నిత్యామీనన్ నటన తోడవ్వడంతో సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంతో నిత్యామీనన్ మరో విజయాన్ని అందుకుంటారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!