

ఫిల్మ్‌మేకర్ ఫర్హాన్ అక్తర్ తన రాబోయే చిత్రం ‘డాన్ 3’పై మరోసారి ఆసక్తిని పెంచేలా ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘దిల్ చాహ్తా హై’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాను గుర్తుచేసుకున్న ఫర్హాన్.. షూటింగ్ ప్రారంభానికి ముందు సైఫ్ అలీ ఖాన్ దాదాపు సినిమా నుంచి తప్పుకోవాలనుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అదే సందర్భంలో షూటింగ్‌కు నెల ముందు నటులు సినిమాల నుంచి తప్పుకోవడం ఈ మధ్య ఓ ప్యాటర్న్‌లా మారిందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఫర్హాన్ ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు రణ్‌వీర్ సింగ్‌తో ముడిపడి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘డాన్ 3’ నుంచి రణ్‌వీర్ తప్పుకోవడం అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద చర్చకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఫర్హాన్ తాజా వ్యాఖ్యలు సినిమాపై మళ్లీ గాసిప్స్, చర్చలకు తెరతీశాయి. ‘డాన్ 3’ తదుపరి పరిణామాలపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!