

టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ప్రతిష్ఠాత్మక మైథలాజికల్ మూవీ ‘వృషకర్మ’లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ కొనసాగుతుండగానే, మీనాక్షికి మరో భారీ అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
నితిన్ హీరోగా నటించనున్న ఓ రొమాంటిక్ కామెడీలో మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘సామజవరగమన’తో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నితిన్‌తో రామ్ అబ్బరాజు మరో పూర్తి స్థాయి కామెడీని తెరకెక్కిస్తారా, లేక కొత్త జానర్‌ను ప్రయత్నిస్తారా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!