

నయనతార సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తన స్టార్‌డమ్‌ను క్రమంగా పెంచుకుంటున్న కథానాయిక. సినిమాలకు తీసుకునే పారితోషికంతో పాటు ప్రకటనల కోసం వసూలు చేసే మొత్తంలోనూ ఆమె అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రంలో నయనతారకు ఇతర కథానాయికల కంటే అధిక పారితోషికం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ సినిమాలో కియారా అద్వానీ గ్లామర్ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెకు రూ.12–15 కోట్ల వరకు పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతుండగా, నయనతారకు దాదాపు రూ.18 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ వంటి నటీమణులకు రూ.3 కోట్లలోపే పారితోషికం అందినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ‘టాక్సిక్’లో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా నయనతార పేరు తెరపైకి వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!