

‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమితా బైజు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. దక్షిణాదిలో వరుస విజయాలతో ఆమెకు క్రేజ్ పెరుగుతున్నప్పటికీ.. తెలుగులో నేరుగా ఓ సినిమాలో నటించాలన్న కోరిక మాత్రం కొనసాగుతోంది. కొందరు దర్శక నిర్మాతలు ఆమెను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. స్టార్ హీరోల సరసన ఆమెను ఎంపిక చేసే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటివరకు తెలుగులో సరైన అవకాశం దక్కలేదని సమాచారం.
తమిళంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, మలయాళంలో ‘బెత్లహాం ఫ్యామిలీ యూనిట్’ చిత్రాలతో మమితా బైజు గుర్తింపు మరింత పెరిగింది. ఈ చిత్రాల్లో వయసులో వ్యత్యాసం ఉన్న ప్రేమకథల్లో ఆమె కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్యతో, ‘బెత్లహాం ఫ్యామిలీ యూనిట్’లోనూ వయసు తేడా ఉన్న పాత్రలో నటించింది. ఇలాంటి కథలకు ఆమె సరిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మలయాళంలో ఆమె పారితోషికం కోటి రూపాయలలోపే ఉంటుందని, తెలుగులో అవకాశం వస్తే రూ.2 కోట్లకు పైగా డిమాండ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక స్పష్టత లేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!