

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘జై హనుమాన్’. 2024 సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘హనుమాన్’లో రాముడి పాత్ర కనిపించకపోయినా.. ‘జై హనుమాన్’లో మాత్రం రాముడి పాత్రకు కీలకమైన స్థానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారనే ఆసక్తి నెలకొంది.
నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. రాముడి పాత్ర కోసం ప్రశాంత్ వర్మ పలువురు స్టార్ హీరోలను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘జై హనుమాన్’ అంటే రిషబ్ శెట్టి ప్రధానంగా గుర్తుకు వస్తుండటంతో.. టాలీవుడ్ స్టార్ హీరోలు గెస్ట్ రోల్ చేసేందుకు ఆసక్తి చూపుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కన్నడ నుంచి మరో హీరోను ఈ పాత్ర కోసం తీసుకుంటారా? లేక రాముడి పాత్రను పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రూపొందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!