

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో దర్శకుడు మారుతిపై విమర్శలు వస్తున్నాయి. కమర్షియల్ అంశాలను భిన్నమైన కాన్సెప్ట్‌తో మేళవించి ఈ సినిమాను రూపొందించినప్పటికీ, ఆ ప్రయత్నం ఆశించిన స్థాయిలో ఫలించలేదు. అయినప్పటికీ మారుతి వెనక్కి తగ్గకుండా తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, మారుతి తన కొత్త సినిమాను నవంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక కథను రూపొందించిన ఆయన, ఈ చిత్రంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. తన గత కామెడీ చిత్రాల తరహాలోనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, 2027 మార్చిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో మారుతి మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటారా అనేది వేచి చూడాలి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!