
ఓటీటీ

రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం పెద్ది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, బుధవారం నుంచి చిత్రంలో కొన్ని కొత్త సీన్లు జోడించనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
అయితే దర్శకుడి ప్రకటన వచ్చినప్పటికీ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అదనపు సన్నివేశాలు నిజంగా జోడించారా లేదా ఆ నిర్ణయం వాయిదా పడిందా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఉదయం షోలు చూసిన ప్రేక్షకుల స్పందనతో పాటు చిత్రబృందం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!