

ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ భారత సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ‘సీతారామం’ వంటి హృద్యమైన ప్రేమకథను అందించిన హను రాఘవపూడి, ఈసారి యుద్ధం మరియు ప్రేమను కలిపిన విభిన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలోని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ప్రభాస్, హీరోయిన్ ఇమాన్వి మధ్య సాగే ప్రేమకథ మరియు భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభాస్ ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!