

సూపర్‌స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు 46 ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్‌కు అల్లుడిగా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రామ్ పాత్రలో ప్రతినాయక ఛాయలు ఉంటాయని, రజినీకాంత్‌తో ఆయనకు భారీ ఫేస్‌ఆఫ్ సన్నివేశాలు ఉంటాయని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
‘ధర్మన్’లో సిమ్రాన్ రజినీకాంత్ భార్యగా, రాశీ ఖన్నా వారి కుమార్తెగా నటిస్తున్నట్లు సమాచారం. యోగిబాబు, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్టార్‌డమ్‌కు అశ్వత్ మారిముత్తు యూత్‌ఫుల్ టేకింగ్ జత కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రామ్ పోతినేని పాత్రపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!