

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. ఇందులో విలక్షణ నటుడు యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ లుక్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ ప్రత్యేక విఎఫ్ఎక్స్ పనులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పాత్రకు సంబంధించిన రూపకల్పనపైనే చిత్ర బృందం ప్రధానంగా దృష్టి సారిస్తోందట. సాయి పల్లవి లుక్ విషయంలోనూ ఇదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నవతరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విదేశీ నిపుణులు కూడా పనిచేస్తున్నారు. సరికొత్త సాంకేతికతతో పాటు భారీ సెట్స్‌ను ఉపయోగిస్తూ ఇండియా మరియు విదేశాల్లో చిత్రీకరణ సాగుతోంది. దీంతో ‘రామాయణ’పై సినీప్రియుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ కథ, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా మేకర్స్ ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!