

బాలీవుడ్ స్టార్ నటి రవీనా టండన్ మరోసారి కన్నడ చిత్రసీమలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో ఉపేంద్ర (1999) చిత్రంతో కన్నడ ప్రేక్షకులకు చేరువైన ఆమె, కేజీఎఫ్: చాప్టర్ 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఏ ఫర్ ఆనంద్ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె కన్నడ ప్రేక్షకుల ముందుకు మరోసారి రానుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఎం.జి. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా పిక్చర్స్ బ్యానర్‌పై గీతా శివరాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. గతంలో శివరాజ్‌కుమార్‌తో కలిసి ఘోస్ట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు, ఇప్పుడు మరోసారి ఆయనతో పనిచేస్తున్నారు. అర్జున్ జన్య ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానున్నట్లు సమాచారం. రవీనా టండన్, శివరాజ్‌కుమార్ తొలిసారి కలిసి నటిస్తున్నారనే అంశం సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే, రవీనా పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!