

సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సాయిపల్లవి మరో విభిన్న పాత్రకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘D55’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ధనుష్‌తో మళ్లీ జతకడుతున్న సాయిపల్లవి ఈసారి శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘అమరన్’ ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి పాత్ర కథలో కీలక మలుపులు తీసుకురానుందని సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీల, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!