

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించిన సారా అర్జున్.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ సరసన నటించిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతం కావడంతో సారా క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఆమె ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్‌కు చెందిన టాలెంట్ మేనేజ్‌మెంట్ విభాగం ‘వైఆర్‌ఎఫ్ టాలెంట్’లో చేరినట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఇక దర్శకుడు మనీశ్ శర్మ తెరకెక్కించనున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో సారా అర్జున్ కథానాయికగా నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘సప్నే Vs ఎవ్రీవన్’తో యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్ వర్మ ఈ సినిమాలో సారాకు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అహాన్ పాండే, అనీత్ పద్దా, శర్వరి తదితర యువ నటులను తన రోస్టర్‌లో నిర్వహిస్తున్న వైఆర్‌ఎఫ్ టాలెంట్‌లోకి సారా చేరినట్లు వార్తలు రావడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!