

టాలీవుడ్‌లో 2026 ద్వితీయార్థంలో వరుసగా భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇద్దరు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్లపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. నాని ‘ది ప్యారడైజ్’, ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రాల విడుదల తేదీల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ‘ది ప్యారడైజ్’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందనే ఇండస్ట్రీ వర్గాల చర్చ జరుగుతోంది. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ‘యశనగుల’ పాట ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి సారించారు.
మరోవైపు ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత 2026 డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లెగసీ’ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో రెండు భారీ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయా అనే చర్చ మొదలైంది. ‘ఫౌజీ’ డిసెంబర్ 3 విడుదలపై చిత్రబృందం నుంచి తాజాగా ఎలాంటి రీ-కన్ఫర్మేషన్ రాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు నాని, ప్రభాస్ కెరీర్‌లో కీలక ప్రాజెక్టులుగా ఉండటంతో.. మేకర్స్ తుది రిలీజ్ ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!