
జనరల్

నటి మృణాల్ ఠాకూర్, టీమ్ ఇండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్లో ఉన్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలోని ఓ కేఫ్ వద్ద ఇద్దరూ కనిపించిన వీడియోతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఓ ఆంగ్ల మీడియా సంస్థ స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న వీడియో తప్పుదారి పట్టించేలా ఎడిట్ చేయబడిందని వెల్లడించింది.
ఆ మీడియా కథనం ప్రకారం, యశస్వి జైస్వాల్ ముందుగానే కేఫ్‌కు వెళ్లి బయటకు రాగా, మృణాల్ ఠాకూర్ అనంతరం తన స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చారు. వేర్వేరు సమయాల్లో చిత్రీకరించిన రెండు వీడియోలను కలిపి ఒకే సమయంలో కలిసినట్లు చూపించడంతో ఈ గందరగోళం ఏర్పడిందని పేర్కొంది. గతంలో కూడా ధనుష్, శ్రేయస్ అయ్యర్‌లతో మృణాల్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారాలు వచ్చినప్పటికీ, వాటిని ఆమె ఇప్పటికే ఖండించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!