

ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ వర్గాల్లోనూ ఆసక్తి కొనసాగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. కొన్ని ప్యాచ్ వర్క్స్ మినహా ప్రధాన చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే భారీ వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్ల కారణంగా ‘వారణాసి’ విడుదల వరకు రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రమోషన్స్ సందర్భంగా సూర్యతో సినిమా చేసే అవకాశంపై రాజమౌళికి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ఆయన.. సూర్యతో కలిసి పనిచేస్తే అది కచ్చితంగా ప్రత్యేకమైన సినిమా అవుతుందని పేర్కొన్నారు. దీంతో చాలా కాలంగా ప్రచారంలో ఉన్న రాజమౌళి–సూర్య కాంబినేషన్‌పై మరోసారి ఆసక్తి నెలకొంది. సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు దక్షిణాది మార్కెట్లలో మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. అయితే ‘వారణాసి’ తర్వాత సూర్యతోనే రాజమౌళి సినిమా చేస్తారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. ఈ కాంబినేషన్ వాస్తవ రూపం దాల్చుతుందా అనేది అధికారిక ప్రకటనతోనే స్పష్టమవుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!