

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రెండో రోజు నుంచే వసూళ్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
ఇదిలా ఉండగా, ‘టాక్సిక్’ ఓటీటీ, శాటిలైట్ హక్కుల విషయంలో కూడా కొంతకాలంగా చర్చ నడుస్తోంది. మేకర్స్ ఆశిస్తున్న భారీ ధరలకు ఓటీటీ సంస్థలు ముందుకు రాలేదనే వార్తలు గతంలో వినిపించాయి. తాజాగా బాలీవుడ్ వర్గాల కథనాల ప్రకారం ఈ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారైనట్లు తెలుస్తోంది. అన్ని భాషల డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డీల్‌పై మేకర్స్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!