
జనరల్

మసాలా చిత్రాన్నం పుల్లపుల్లగా, రుచిగా ఉండే ప్రసిద్ధ వంటకం. నిమ్మరసం, కొబ్బరి మసాలా కలయికతో తయారయ్యే ఈ వంటకం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది త్వరగా తయారయ్యే వంటకం కావడంతో లంచ్బాక్స్కి లేదా తేలికపాటి భోజనంగా అనుకూలంగా ఉంటుంది.
తయారీ కోసం ఒక కప్పు ఉడికించిన అన్నం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి తురుము తీసుకోవాలి. ముందుగా కొబ్బరి, ఎండుమిర్చి, వేయించిన ధనియాలు, పసుపుతో మసాలా పేస్ట్ తయారు చేయాలి. పాన్లో తాలింపు వేసి అన్ని పదార్థాలను వేయించి, మసాలా పేస్ట్ వేసి వాసన పోయే వరకు ఉడికించాలి. చివరగా అన్నం, ఉప్పు, నిమ్మరసం కలిపి బాగా కలిపితే టేస్టీ మసాలా చిత్రాన్నం సిద్ధం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!