

వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధుల గుర్తింపు, స్కానింగ్ నివేదికల విశ్లేషణ, చికిత్స పర్యవేక్షణతో పాటు క్లిష్టమైన శస్త్రచికిత్సల్లోనూ ఏఐ కీలకంగా మారుతోంది. తాజాగా యూకేకు చెందిన 48 ఏళ్ల రిస్ హిబ్బర్ట్‌కు ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రిస్ హిబ్బర్ట్ ఒకరోజు నడుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, అనంతరం మూర్ఛకు గురయ్యారు. పరీక్షల్లో పిట్యుటరీ గ్రంథి సమీపంలో 11 మిల్లీమీటర్ల పరిమాణంలో కణితిని గుర్తించారు. అది క్యాన్సర్ కాకపోయినప్పటికీ చూపుపై ప్రభావం చూపడంతో దాన్ని తొలగించడం అవసరమైంది. ఎండోస్కోప్ ద్వారా అందిన ప్రత్యక్ష శస్త్రచికిత్స దృశ్యాలను ఏఐ విశ్లేషించడంతో రక్తనాళాలు, నరాలకు నష్టం కలగకుండా వైద్యులు సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్స మేలో జరిగినప్పటికీ, రోగి పూర్తిగా కోలుకున్న తర్వాతే వివరాలను వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!