

సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్న మేకర్స్, విడుదల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ప్రస్తుతం 200 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మహేష్ బాబు అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
విడుదల కౌంట్‌డౌన్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘రుద్ర’, ‘గ్లోబ్ ట్రాటర్’ పాత్రల్లో మహేష్ బాబు ఎలా కనిపించనున్నారనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘వారణాసి’ని ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!