

జనన, మరణాల నమోదును మరింత కచ్చితంగా, పారదర్శకంగా, సకాలంలో నిర్వహించేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2026లోని మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జనన లేదా మరణం జరిగిన ఏడాది తర్వాత, రెండేళ్లలోపు నమోదు చేయాలంటే జిల్లా మేజిస్ట్రేట్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా అధికృత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశం అవసరం. ఈ ప్రక్రియలో సంబంధిత వివరాల ధృవీకరణతో పాటు నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రెండేళ్లకు మించి ఆలస్యంగా జనన లేదా మరణాన్ని నమోదు చేయాలంటే ఇకపై ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి. ఆలస్య నమోదులో ధృవీకరణ ప్రక్రియను కఠినతరం చేయడం ద్వారా రికార్డులను మరింత విశ్వసనీయంగా ఉంచడంతో పాటు తప్పుడు లేదా ధృవీకరించలేని నమోదులను నిరోధించడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!