
సినిమాలు

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్రిప్తి డిమ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 40 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు దర్శకుడు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ, కథను పూర్తిగా మలుపు తిప్పే స్థాయిలో ఉంటుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా కథ వినిపించగా, పాత్ర ప్రాధాన్యత నచ్చి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్-కత్రినా కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!