

సీనియర్ నటి లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చిన లయ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె వయసు పెరిగినా తన అందం, ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో వివరించారు.
లయ మాట్లాడుతూ, పెళ్లికి ముందు అమ్మాయిలు ఫిట్‌గా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తారని, కానీ పెళ్లి తర్వాత అదే పట్టుదల కొనసాగించరని అన్నారు. తాను కూడా పెళ్లి తర్వాత వ్యాయామాన్ని తగ్గించానని, కానీ కొంతకాలానికి మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం జిమ్‌తో పాటు డాన్స్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నానని తెలిపారు. డాన్స్ వల్ల మనసు ఉల్లాసంగా ఉండటమే కాకుండా మంచి వ్యాయామం కూడా అవుతుందని, దీని ద్వారా ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని ఆమె చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!