
ఓటీటీ

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అఖిల్ కెరీర్లో ఇదే తొలి రూ.100 కోట్ల సినిమా కావడం విశేషం. ఈ అరుదైన విజయంతో అభిమానులకు అఖిల్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
"నన్ను నమ్మి, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది మీ కోసమే. అపారమైన కృతజ్ఞతతో ముందుకు సాగుతున్నాను. త్వరలోనే మరో సినిమాతో మీ ముందుకు వస్తాను" అని అఖిల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం జూలై 10న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!