
సినిమాలు

యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ‘ఆల్ఫా’ ట్రైలర్ విడుదలైన వెంటనే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మహిళా ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో ఆలియా భట్, శార్వరి పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథనంతో ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్పందనను అందుకుంటోంది.
ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా కనిపించగా, హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో మెరవడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. శివ్ రావల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రోహన్ష్, అబీర్ సంగీతం అందించారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘ఆల్ఫా’ స్పై యూనివర్స్‌లో కీలక చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!