

దీవాన సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నేటి యువత ప్రేమ గురించి మాట్లాడుతూ, చాలా మంది ప్రేమ జంటలు ముందుగా జనాలు తక్కువగా ఉండే థియేటర్లలో కార్నర్ సీట్లలో కూర్చొని సినిమాలు చూస్తారని, తర్వాత షాపింగ్‌లతో సమయం గడిపి చివరకు ఓయో రూమ్‌ల వద్దకు చేరుకుంటున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ చమత్కార వ్యాఖ్యలు కార్యక్రమానికి హాజరైన వారిని నవ్వుల్లో ముంచెత్తాయి.
అల్లు అరవింద్ వ్యాఖ్యలకు స్పందించిన హీరో విశ్వక్ సేన్ సరదాగా "అంటే ఏంటి సార్, నాకు తెలియదు" అంటూ నవ్వులు పూయించారు. అనంతరం ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి అడిగిన ప్రశ్నకు కూడా అల్లు అరవింద్ తనదైన హాస్యశైలిలో సమాధానం ఇచ్చారు. హర్షిత్ రెడ్డి, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన దీవాన చిత్రానికి శ్రీకాంత్ సింగిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!