

‘మ్యాడ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అనంతిక సనీల్‌కుమార్, ‘8 వసంతాలు’తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె ‘రోమాంచకం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనంతిక తన కుటుంబం, కెరీర్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే కళలు, ముఖ్యంగా నాట్యం అంటే ఎంతో ఇష్టమని, ఆరో తరగతి నుంచి వేదికపై ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, తల్లిదండ్రులు ఎప్పుడూ తనను ప్రోత్సహించారని చెప్పారు.
తల్లిదండ్రులు తన కోసం చేసిన కష్టాలను దగ్గరగా చూసిన తాను, వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే సినీ పరిశ్రమలోకి వచ్చినట్లు అనంతిక తెలిపారు. తన కెరీర్‌లో పలు పెద్ద ప్రాజెక్టులు మిస్ అయినట్లు కూడా వెల్లడించారు. ఫొటోలు పంపిన తర్వాత చిన్న పిల్లలా కనిపిస్తున్నాననే కారణంతో కొన్నిసార్లు తిరస్కరణ ఎదురైందని, అదే కారణంతో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లో అవకాశం కోల్పోయినట్లు చెప్పారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ముందుకు సాగడమే తన మనస్తత్వమని, ‘రోమాంచకం’ చిత్రం విజయంపై పూర్తి నమ్మకం ఉందని అనంతిక పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!