
సినిమాలు

‘డీజే టిల్లు’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటించిన ‘అనుమాన పక్షి’ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తూ, అతిగా ఆలోచించే వ్యక్తి చుట్టూ కథ సాగుతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. రాగ్ మయూర్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కామెడీని పండిస్తున్నాయి.
కామెడీతో పాటు క్రైమ్, థ్రిల్లర్ అంశాలను కూడా మేళవించినట్లు ట్రైలర్ సూచిస్తోంది. మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటించగా, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, అనన్య, చరిత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!