
జనరల్

నీట్ పరీక్ష అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా వెళ్లిన బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడు, స్నేహితులతో కలిసి దాదర్‌లోని నిరసన ప్రదేశానికి చేరుకున్న సమయంలోనే పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను వోర్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఘటన అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన ఆయేషా, తన కెరీర్‌కు నష్టం జరిగినా ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోనని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని ఆమె పేర్కొన్నారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో అధికారులు సరైన కారణం చెప్పలేదని ఆరోపిస్తూ, ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!