

యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రం ‘హైందవ’ విడుదల తేదీ ఖరారైంది. లుదీర్ బైరెడ్డి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే సమయంలో టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఆసక్తికరమైన కథాంశం, ఆకట్టుకునే విజువల్స్‌తో ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
దేవాలయాల నుంచి పది మంది దేవతామూర్తుల విగ్రహాలు మాయమవడం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. అదృశ్యమైన విగ్రహాల ఆచూకీ కనుగొనే బాధ్యతను చేపట్టే పోలీస్ అధికారిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించనున్నారు. అయితే, ఆయన పాత్ర నాస్తికుడు కావడం కథలో ఆసక్తికరమైన మలుపు. విగ్రహాలను ఎవరు దొంగిలించారు, ఎందుకు దొంగిలించారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైనే తెలియనున్నాయి. జేడీ చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేశ్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!